వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది…

చిరు సందేశాలు మొదలు వీడియో స్ట్రీమింగ్‌ వరకు శరవేగంతో దూసుకెళ్తున్న సోషల్ మీడియా సంచలనం వాట్సాప్… సరికొత్తగా మరో ఆప్షన్ జోడించింది. టెక్స్ట్ సందేశాలు పంపుతున్నప్పుడు ఈమోజీలను సులభంగా వెదికేలా సెర్చ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్‌తో.. ఇకపై ఈమోజీల కోసం అదే పనిగా స్క్రోలింగ్ చేస్తూ వెతుక్కోవాల్సిన పనిలేదు. ఉదాహరణకు సెర్చ్ ఆప్షన్‌లోకి వెళ్లి ‘హ్యాండ్’ అని టైప్ చేస్తే… చేతి గుర్తు రెడీగా కనిపిస్తుందన్నమాట. దీంతో క్షణాల్లో సందేశాలను అందంగా పంపుకోవచ్చు. బీటా వెర్షన్‌ 2.17.246లో ఈమోజీ సెర్చ్‌ ఆప్షన్ ఇప్పటికే యాక్టివేట్‌ కాగా… మిగతా వెర్షన్లలో కూడా త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
మరోవైపు ఇంతకుముందే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్ ఆప్షన్… తాజాగా ఐఫోన్లలో కూడా అడుగుపెట్టింది. ఇక ఎప్పటినుంచో ఊరిస్తున్న రీకాల్ ఫీచర్‌ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు వాట్సప్ ఎఫ్ఏక్యూ ప్రశ్నోత్తరాల్లో సూచన ప్రాయంగా వెల్లడించింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *