రంగస్థలం ఆలస్యానికి అసలు కారణం ఇదేనట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ ‘రంగస్థలం 1985’. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటగా ఈ మూవీ ని దసరా కు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత షూటింగ్ లేట్ కావడం తో దసరా కాస్త దీపావళి , దీపావళి కాస్త క్రిస్మస్ ,సంక్రాంతి కి మారిపోయింది. సంక్రాంతి కి కూడా వస్తుందనే నమ్మకాలు కనిపించడం లేదు.

అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేదాని ఫై ఆరా తీయగా గ్రాఫిక్స్ వల్ల మూవీ రోజు రోజుకి లేట్ అవుతుందని తెలుస్తుంది. బాహుబలి పుణ్యమా అని మన సినీ జనాలు ఎక్కువగా గ్రాఫిక్స్ అలవాటు పడ్డారు. దీంతో పెద్ద సినిమాలన్నీ కూడా గ్రాఫిక్స్ బాట పట్టాయి. దీంతో అనుకున్న మేరకు గ్రాఫిక్స్ కుదరకపోవడం తో సినిమా రిలీజ్ లు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు రంగస్థలం కూడా గ్రాఫిక్స్ బారిన పడిందట. అనుకున్న మేరకు గ్రాఫిక్స్ త్వరగా పూర్తి కాకపోయేసరికి ఈ సినిమా ఆలస్యం అవుతుందట.

Videos

Leave a Reply

Your email address will not be published.