హెచ్1బి వీసాలకు ఇక గడ్డుకాలమే!
అలాంటి కంపెనీలపై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు తాను పోరాడతానని వేలాది మంది మద్దతుదారుల మధ్య జరిగిన సభలో ట్రంప్ చెప్పారు. కేవలం వీసాల విషయాన్ని ప్రస్తావించడమే కాక, డిస్నీలాండ్ లాంటి కొన్ని కంపెనీల పేర్లను కూడా ఆయన ప్రకటించారు.
ఉద్యోగాలు పీకేయడమే కాక.. కొత్తగా వచ్చేవాళ్లకు ట్రైనింగ్ ఇస్తే తప్ప చివర్లో ఇవ్వాల్సిన ప్రయోజనాలను కూడా ఇవ్వలేదని, ఇది మరింత దారుణమని ట్రంప్ వ్యాఖ్యానించారు. డిస్నీ వరల్డ్, మరో్ రెండు ఔట్సోర్సింగ్ కంపెనీలపై వాటిలో ఇంతకుముందు పనిచేసిన టెక్నాలజీ సిబ్బంది కేసులు దాఖలు చేశారు. తమ ఉద్యోగాలు పీకేసి, తక్కువ జీతాలకు హెచ్1బి వీసాలపై వచ్చే విదేశీయులను నియమించుకున్నారని, వాళ్లలో ఎక్కువ మంది భారతీయులేనిన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డిస్నీవరల్డ్లో మొత్తం 250 మందిని 2015 జనవరిలో ఇలా పీకేశారు. హెచ్సీఎల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కూడా ఇలా చేసిన కంపెనీల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ ట్రంప్ తేబోయే కొత్త చట్టాలతో ఇబ్బంది పడక తప్పదు.