ఢిల్లీ ఘాతుకం: 22 సార్లు కత్తితో పొడిచి చంపాడు!(వీడియో)

ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దీన్ని దారుణ సంఘటన అనాలో మనిషి రాక్షసుడిగా మారిన సమయం అనుకోవాలో కానీ… పట్టపగలు అందరూ చూస్తుండగా.. దేశరాజధానిలో నడిరోడ్డుపై ఒక వ్యక్తి మహిళపై దాడిచేశాడు. దాడి అంటే అలాంటిలాంటిది కాదు… కత్తితో దాడి. రెండు కాళ్ల రాక్షసుడిలా పరుగున వచ్చిన ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళపై కృరంగా 22సార్లు కత్తితో పొడిచాడు. దాంతో వెంటనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

వివరాళ్లోకి వెళితే… ఉత్తర ఢిల్లీలోని బురారీలో కరుణ అనే 21 ఏళ్ల టీచర్ స్థానిక పాఠశాలలో పనిచేస్తుంది. ఈమెను ప్రేమిస్తున్నానని 34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి తరచూ వెంటాడటం వేధించడం చేస్తుండేవాడు. ఆ వేదింపులను కొంతకాలం భరించిన ఆ టీచర్… తర్వాతి కాలంలో ఆ వేధింపులు ఎక్కువవడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఐదు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ యువకుడిని స్టేషన్ కు పిలిపించిన పోలీసులు చర్యలు ఏమీ తీసుకోకుండా.. హెచ్చరించి పంపించారు.

అనంతరం ఆమెపై కక్ష పెంచేసుకున్న సురేందర్ మంగళవారం ఆమె పాఠశాలకు వెళ్తున్న సమయంలో వెంబడించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై 22 సార్లు అత్యంత కిరాతకంగా పొడిచాడు. ఈ సంఘటన నడిరోడ్డుపై జరిగింది.. ఆ సమయంలో ఆపేందుకు ఎవరూ ముందుకు రాకుండా చూస్తూ ఉండిపోయారు. దాంతో రక్తం మడుగులోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. సురేందర్కు ఇంతకుముందే పెళ్లయిందని భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా.. అక్కడ కేసు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *