సీఎం బుగ్గపై ముద్దుపెట్టిన మహిళ

ఆయన సాక్షాత్తూ కర్ణాటక ముఖ్యమంత్రి. అయితే, అది ఆమెకి పెద్ద విషయం కాలేదు. ఏకంగా పబ్లిక్ మీటింగ్‌లో సీఎంకి కిస్ ఇచ్చింది. ప్రజలందరూ చూస్తుండగానే… వీడియో కెమెరాలు ఆన్‌లో ఉండగానే… బుగ్గమీద ఓ ముద్దుపెట్టి… ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

కురుబ కులం నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు బెంగళూరులో ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి వచ్చిన చిక్‌మంగళూర్ జిల్లా తరికెరె పంచాయతీ మెంబర్ గిరిజా శ్రీనివాస్… సిద్దుకి ముద్దిచ్చి సైలెంట్‌గా వెళ్లిపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే వరుస వివాదాల్లో ఉన్న సిద్ధారామయ్య ప్రత్యర్థులకు మరో అస్త్రం దొరికినట్టే అంటున్నారు విశ్లేషకులు. గతంలో అత్యంత విలువైన వాచ్‌తో ఒకసారి… కాకి కూర్చుందని… కారు మార్చి మరోసారి… వరల్డ్‌ యోగా డే రోజు బిపాసాకు కోటిన్నర ఇచ్చి ఇంకోసారి విమర్శలకు గురైన కర్నాటక సీఎం… ఇప్పుడు కిస్‌ మరేంచేస్తుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *