ఇదిగో .. దీపిక పదుకొణె ‘xxx’ వీడియో

హాటీ దీపికా పదుకొనె తొలిసారిగా హాలీవుడ్ లో ఒక సినిమాలో చేస్తోందంటే.. ఖచ్చితంగా అది లీడింగ్ రోల్ అయ్యుంటుందని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఎక్స్ కొత్త భాగం తొలి ట్రైలర్ ను చూస్తే మాత్రం అలాంటి ఫీలింగే రావట్లేదు. పదండి ఓ లుక్కేద్దాం.

డీజే క్యారుసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విన్‌డీజిల్‌తో పాటు నీనా డోబ్రేవ్‌, రూబీ రోజ్‌లు నటించారు. జనవరి 20, 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం దీపిక భారీగా కసరత్తులు చేస్తోండగా, ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ వీడియో స్టన్నింగ్ గా ఉందంటూ దీపిక అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.మీరూ ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు.

ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సెరెనా అనే అమ్మాయిగా దీపిక కనిపించనుండగా,ఈ చిత్రంలో దీపిక లుక్ అభిమానుల మనసులను దోచుకునేలా ఉందంటూ అభిమానులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇంక ఈ చిత్రాన్ని 2017లో విడుదల చేయనున్నట్టు సమాచారం.మరి దీపికను హాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published.