బాలక్రిష్ణ సినిమాలో యంగ్ హీరో

నందమూరి బాలక్రిష్ణ, తేజల కలయికలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ ను ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్ని దాదాపు ముగించుకున్న ఈ చిత్రం మార్చి 9న అధికారికంగా లాంచ్ కానుంది. బాలక్రిష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే యంగ్ హీరో శర్వానంద్ యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రను పోషించనున్నాడట . అయితే ఈ వార్తపై ఇంకా చిత్ర టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వచ్చే ఏడాది జనవరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *