అసెంబ్లీకి బీటలు.. వాన నీటికి అసెంబ్లీలోని జగన్ ఛేంబర్ కుదేలు

ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని అమరావతి చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిపోయింది. ప్రభుత్వ పెద్దలకు ప్రీతిపాత్రమైన ప్రైవేట్‌ సంస్థలు రూ.వందల కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం బండారం బట్టబయలైంది. మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతమంతా బురదమయంగా మారింది.

ఏపీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి వర్షం నీరు చేరి పైకప్పు ఫ్లెక్సీలు ఊడిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్త రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. రాజధాని ప్రాంతం ఎంపిక నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగానే ఇలా జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఒక్క వర్షానికి బక్కెట్లతో నీళ్లు తోడుకోవాల్సిన దుస్థితి నెలకొందంటే రాజధాని నిర్మాణంలో  అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఒక్క వర్షానికే తాత్కాలిక సచివాలయంలోకి నీరు చేరడం ద్వారా చంద్రబాబు అవినీతి బయపడిందని మండిపడ్డారు. అవినీతిని బయటపడుతుందనే భయంలో మీడియాను అనుమంతించకుండా ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని అన్నారు.

సీఎం కార్యాలయంలోకి వాన నీరు
అసెంబ్లీ, సచివాలయంలోని పలు బ్లాకుల్లోకి వర్షపు నీరు చేరడంతో రికార్డులు తడిసిపోకుండా చూడడానికి ఉద్యోగులు, సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం ఉన్న బ్లాకుతోపాటు నాలుగో బ్లాకులోని రెవెన్యూ శాఖ సెక్షన్, ఇతర బ్లాకుల్లోని కారిడార్లలోకి వాన నీరు చేరడంతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగింది. భవనాల్లో లీకేజీలతో వచ్చిన నీటిని సిబ్బంది బక్కెట్లతో ఎత్తిపోశారు. వాన నీటికి బయటకు తోడేందుకు చాలా సమయం పట్టింది. సచివాలయం వెలుపల సెక్యూరిటీ గేటు వద్ద సందర్శకుల కోసం నిర్మిస్తున్న భవనంపై నీరు నిలిచిపోయింది. దీంతో ఆ కొత్త భవనం గోడ నానిపోయి బీటలు వారింది. సిబ్బంది జేసీబీతో ఆ గోడను కూలగొట్టారు. సచివాలయం బయట సందర్శకుల కోసం వేసిన టెంట్లు కూలిపోయాయి. అసెంబ్లీ, సచి వాలయం ప్రాంతమంతా నీటితో అస్తవ్యస్తం గా మారిపోయింది. ప్రాంగణంలోని పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మళ్లించేందుకు సిబ్బంది నానా తిప్పలు పడ్డారు.

Videos

1,656 thoughts on “అసెంబ్లీకి బీటలు.. వాన నీటికి అసెంబ్లీలోని జగన్ ఛేంబర్ కుదేలు