సోషల్ మీడియాలో జగన్ ఫొటోలు హల్చల్

ఏపీ విపక్ష నేతకు చెందిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

భార్య.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం బ్రిటన్.. స్కాట్లాండ్ లో ఉన్న జగన్ తాజాగా ఈడన్ బర్గ్ చేరుకున్నారు. అక్కడ ఆయన గోల్ఫ్ ఆడుతూ ఉన్న వేళ తీసిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. మొత్తం తన పది రోజుల విదేశీ పర్యటనలో ఏడు రోజులు యూకేలో గడిపిన జగన్.. మరో మూడు రోజులు ఐర్లాండ్.. స్కాట్లాండ్ లో గడపనున్నారు.ఈ నేపథ్యంలో ఆయన అక్కడ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 16వ తేదీ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా బయల్దేరి ఇంగ్లండ్ వెళ్లిన ఆయన.. మొత్తం 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారని ఇంతకుముందు పార్టీ వర్గాలు తెలిపాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *