జగన్ కూతురు.. అరుదైన ఘనత?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారనే విషయం తెలిసిందే. వారి పేర్లు వర్ష,హర్ష. పెద్దగా ప్రచారార్భాటాలు లేకుండా వీరు పెరుగుతున్నారు. రాజకీయాలకు, ఇతర హడావుడికి దూరంగా ఉంచుతూ వీరిని పెంచుతున్నారు జగన్ భారతిలు. వైఎస్ మరణ సందర్భంలోనూ, వైఎస్ జయంతి, వర్ధంతిల సందర్భంలోనూ వీరు అగుపించారు. అయితే అంత వరకే పరిమితం, మళ్లీ ఎక్కడా వీరి ఊసు ఉండదు.

మరి ఈ సంగతిలా ఉంటే.. వైఎస్ జగన్ పెద్ద కూతురు వర్ష గురించి ఆసక్తికరమైన అంశం వార్తల్లోకి వచ్చింది. వర్ష ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సాధించిందనే మాట వినిపిస్తోంది. ఇటీవలే ప్లస్ టూ పూర్తి చేసుకున్న వర్ష గ్రాడ్యుయేషన్ కు ఆ ప్రఖ్యాత విద్యాలయంలో సీటు సంపాదించిందని సమాచారం. మరి ఇది అరుదైన ఘనతే.

ప్లస్ టూలో మంచి మార్కులతోపాటు.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎంట్రన్స్ టెస్టులో మంచి మార్కులుంటేనే అక్కడ సీటు లభిస్తుంది. జగన్ కూతురు ఈ ఘనతను సాధించినట్టుగా తెలుస్తోంది. మరి రాజకీయ నేత తనయ ఇలాంటి ఘనత సాధిస్తే అది పెద్ద విశేషమే. ఈ ఘనతతో అందరి కళ్లూ వర్ష మీద పడతాయని కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపై ఆమె ప్రస్థానం చర్చలో ఉండే అవకాశం ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *