ఖరారైన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

వైసీపీ పార్టీ అధినేత సిఏం జగన్ వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లుని ఖరారు చేశారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ, మహ్మద్ ఇక్బాల్, కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి లను ఎమ్మెల్సే అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈమేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోపిదేవి ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. అలాగే హిందూపురం నుంచి పోటీ చేసిన ఇక్బాల్‌ ఓడిపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో జగన్‌ హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల ముందు తెదేపా నుంచి వైకాపాలో చేరిన చల్లారామకృష్ణారెడ్డి బనగానపల్లి నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. అందుకు ప్రతిఫలంగా చల్లాకు ఎమ్మెల్సీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published.