కామెడీకే కామెడీగా మారిన వైకాపా

రాజ‌కీయ పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌హ‌జం. అయితే ఈ విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు వాటిని జ‌నాలంద‌రూ చూస్తున్నార‌న్న విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే హుందాగా ఉంటుంది. చేసే విమ‌ర్శ‌ల్లో ప‌ట్టు ఉండాలి. అలాంట‌ప్పుడే అది విమ‌ర్శ చేసే వాళ్ల‌కు మంచి మైలేజ్ రావ‌డంతో పాటు చూసేవాళ్ల‌ను సైతం ఆక‌ర్షిస్తుంద‌. కానీ ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైకాపా చేస్తోన్న విమ‌ర్శ‌లు కామెడీగా కామెడీగా మారాయ‌న్న జోకులు పేలుతున్నాయి.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే మూడు రోజులుగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని కేఎల్ వ‌ర్సిటీలో జ‌రిగిన టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల శిక్ష‌ణా స‌మావేశంలో ఓ ఫొటోను ఆధారంగా చేసుకుని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ హోం మంత్రి చిన‌రాజ‌ప్ప‌ను తీవ్ర‌స్థాయిలో తిట్టిన‌ట్టు వైకాపా అనుకూల మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ఫొటోలో చిన‌రాజ‌ప్ప‌ను లోకేష్ ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిడుతున్న‌ట్టు కూడా వైకాపా అనుకూల మీడియాలో ఈ రోజంతా ఊక‌దంపుడు ప్ర‌చారం హోరెత్తించారు.

చిన‌రాజ‌ప్ప నువ్వెంత‌..నీ ప‌ద‌వి ఎంత నేను త‌ల‌చుకుంటే నీ మంత్రి ప‌ద‌వి పోతుంద‌ని లోకేష్ అంద‌రి ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మ‌క్షంలోనే చిన‌రాజ‌ప్ప‌ను అన్న‌ట్టు కామెడీ విమ‌ర్శ‌లు చేసి న‌వ్వుల పాల‌య్యారు. మ‌రో విచిత్రం ఏంటంటే కేవ‌లం ఫొటో ద్వారా ఎవ‌రో పోస్టు చేసిన డైలాగులపై బొత్స స‌త్యానారాయ‌ణ‌లాంటి వారు సైతం సీరియ‌స్‌గా స్పందించ‌డం మ‌రింత విచిత్రంగా మారింది.

ఈ ఫొటోను ఉద్దేశించి బొత్స మాట్లాడుతూ లోకేష్ ముందు డిప్యూటీ సీఎం చినరాజప్ప వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇక ఆయన మాటలు పోలీసులు ఏం వింటారని…లోకేష్‌, చినరాజప్ప ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని….. రాష్ట్రంలో పాలన ఎటుపోతోందని బొత్స సత్యనారాయణ అన‌డంతో చూస్తుంటే వైకాపా విమ‌ర్శ‌లు ఎంత కామెడీగా మారాయో అర్థ‌మ‌వుతోంద‌న్న సెటైర్లు ప‌డిపోతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *